Breaking News

టి.డి. జనార్ధన్ కి 69వ జన్మదినం శుభాకాంక్షలు… : మోటూరి శంకర్‌రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రెటరీ టి.డి. జనార్ధన్ కి ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నగరంలోని తమ కార్యాలయంలో మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ టి.డి. జనార్ధన్ పార్టీలో సీనియర్ నాయకులని, దశాబ్దాలుగా పార్టీకి మరియు ప్రభుత్వానికి సేవలు అందించడమే కాకుండా, మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని సుమారు 2,50,000 పైచిలుకు మాజీ సైనికులు, సైనికులు మరియు అర్ధ సైనిక కుటుంబాలకు ఆయన ఒక ఆరాధ్య దైవంలా నిలిచారన్నారు. మాజీ సైనిక సంఘం తరపున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *