విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతోఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎండ తీవ్రతకి ఇబ్బంది పాదచారులకి మా వంతుగా డొక్కా సీతమ్మ కమిటీ మెంబర్స్ అందరం ఎప్పుడు పేదలకు సేవ చేయడానికి ముందుకు వస్తాం ప్రజలకు ఎప్పుడూ ఏమీ అవసరమో వాటిని మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఆకలితో ఉన్నవారికి,దప్పికతో ఉన్నవారికి మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరం ముందు వచ్చి సహాయం చేస్తున్నందుకు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి స్టేట్ లీడర్ నవనీతం సాంబశివరావు, పిరియ సోమేశ్వరరావు, పిరియ జగదాంబ, కూర్మపు దుర్గారావు నారాయణ, ఉడత వినీత, గుబ్బల జ్యోతి, యర్రపు అభిలాష్, మువ్వ విజయ శ్రీ తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News