విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్ లోక్సభలో ఆమోదం పొందినందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కు చట్టబద్ధత బిల్ లోక్సభ ఆమోదం పలికినందుకు ఈ వేడుకలు జరుపుకుంటున్నామని, నగరంలోని జోనల్ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, వసతి గృహాలులో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విజయలక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, అకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News