Breaking News

రెండో విడత హజ్ యాత్రికుల ప్రయాణానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఫరూక్

-హజ్ యాత్రికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలి
-చివరి విడతగా 177 మంది యాత్రికులు పవిత్ర యాత్రకు వెళ్ళారు
-రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల రెండో విడత ప్రయాణాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్ ఆదివారం గన్నవరం లో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, వారి యాత్ర సాఫల్యంగా, సుఖసంతోషాలతో పూర్తవ్వాలని ఆకాంక్షించారు.

గన్నవరం ఎస్ ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో హజ్ యాత్రికులు మక్కా, మదీనా ప్రయాణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ హాజరై మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి ఆశయాల మేరకు హజ్ యాత్రికులకు ఘనమైన ఏర్పాట్లు పూర్తి చేసి మక్కా కు పంపించటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, వారి పవిత్ర యాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.

విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ వద్ద హజ్ యాత్రికుల చివరి విడత ప్రయాణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ చైర్మన్ హసన్ పాషా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి యాత్రికులను ఉద్దేశించి మాట్లాడారు. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాట్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హజ్ యాత్రికులను పసిపిల్లల్లా సంరక్షించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.

యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండమైన వసతి, రుచికరమైన ఆహార సదుపాయాలు కల్పించాం. భోజన నిర్వాహకులు సైతం లాభాపేక్ష లేకుండా సేవానిరతితో పనిచేశారని కొనియాడారు.

గన్ ప్రొటెక్షన్, పోలీసు శాఖ ద్వారా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమైంది. అత్యవసర వైద్య సాయం కోసం హజ్ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. యాత్రికులకు కీలక సూచనలు చేశారు. సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉన్నందున యాత్రికులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
నూనెతో చేసిన వంటకాలు (వడలు వంటివి) మానుకుని, తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
మక్కా, మదీనాలలో వసతి గృహాల దూరం పెరిగిన దృష్ట్యా సమయపాలన పాటించాలి. వసతి గృహాల్లో గ్యాస్ స్టవ్‌ల వాడకంపై ఉన్న ఆంక్షలను ఖచ్చితంగా గౌరవించాలి. గత ప్రభుత్వ తీరుపై విమర్శలు గత ప్రభుత్వం మైనారిటీల పట్ల అనుసరించిన వైఖరిని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కడపలో నిర్మించిన హజ్ హౌస్‌ను గత ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాలో ఉన్నప్పటికీ పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే మసీదులు, షాదీఖానాల నిధులను రద్దు చేసి మైనారిటీల అభివృద్ధిని అడ్డుకున్నారని దుయ్యబట్టారు.ప్రజావేదికను కూల్చివేసినప్పుడే ఆ ప్రభుత్వ క్రూరత్వం ప్రజలకు అర్థమైందని గుర్తుచేశారు. భవిష్యత్ ప్రణాళికలు అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి స్థలాన్ని కేటాయించారని, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో సౌదీ అరేబియా విమాన సర్వీసుల్లో ప్రాధాన్యత లభించిందని, భవిష్యత్తులో యాత్రికుల సంఖ్యను ఐదు రెట్లు పెంచేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా ప్రతినిధులకు, పోలీసులకు, హజ్ కమిటీ డైరెక్టర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నేడు చివరి విడతగా 177 మంది యాత్రికులు పవిత్ర యాత్రకు బయలుదేరి వెళ్లారు.

కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ అడ్వైజర్ మొహమ్మద్ షరీఫ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ షుబ్లీ, హజ్ కమిటీ హసన్ భాషా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ ఎన్బీఎమ్ మురళీ కృష్ణ, హజ్ కమిటీ సీఈవో గౌస్ పీర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకూబ్ భాషా, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *