Breaking News

సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం పర్యటన

-సామాజిక సమగ్రత, ప్రజా అనుసంధానంలో సింగపూర్ మోడల్ అధ్యయనం
-తొలి రోజు కార్యక్రమాలు విజయవంతం

టాంపిన్స్, సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త :
సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత (Citizen Engagement and Social Cohesion) అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రుల బృందం పాల్గొంది. ఉదయం సింగపూర్ చేరుకున్న అనంతరం యంత్రలో నిర్వహించిన అధికారిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విదేశాంగ, వాణిజ్య శాఖల మంత్రి స్థాయి ప్రతినిధి మిస్ గాన్ సియో హువాంగ్ పాల్గొని పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై మంత్రుల బృందంతో పరస్పర చర్చలు జరిపారు. తదుపరి ఆర్ టాంపిన్స్ హబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఫ్రాన్సిస్ చుంగ్ ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సింగపూర్ మాజీ ఉప కార్యదర్శి అంగ్ హాక్ సేంగ్ సింగపూర్ సామాజిక నిర్మాణం, సోషల్ కంపాక్ట్, ప్రజల భాగస్వామ్యం, పౌరులతో కలిసి సేవల అందజేత వంటి అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. తరువాత సింగపూర్ లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ గా ఉన్న అవర్ టాంపైన్స్ హబ్ సందర్శించి అక్కడ క్రీడలు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ ను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా అవర్ టాంపిన్స్ హబ్ అసోసియేషన్ ప్రతినిధులు సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, ప్రజా సేవల అమలు విధానంపై మంత్రులకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా, పాదర్శకంగా జరుగుతుందో సింగపూర్ ప్రతినిధులను అడిగి ఏపీ మంత్రులు తెలుసుకున్నారు. సాయంత్రం ‘మీట్-ది-పీపుల్ సెషన్’లో పాల్గొని ప్రజలతో ప్రజాప్రతినిధులు ఎలా నేరుగా మమేకమవుతూ.. సమస్యలను పరిష్కరిస్తారో ప్రత్యక్షంగా గమనించారు. ఈ కార్యక్రమంలో మిస్ గాన్ సియో హువాంగ్ పాల్గొని ప్రజలతో పరస్పర చర్యలను నిర్వహించారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలు, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలను అవగాహన చేసుకుని, వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రుల బృందం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే అనుభవాలు లభిస్తున్నాయని బృందం పేర్కొంది. మంత్రుల బృందంలో పి. నారాయణ, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బి.సి జనార్దన్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీ అనంత్ శంకర్, APSDPS ED ఆలపర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇండియన్ హై కమిషనర్‌తో ఏపీ మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *