హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పీవీ & ఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు రూ.1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ లోసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదని, వర్షం పడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ క్రమంలో NH-16 నుండి ఎస్సీ కాలనీ వరకు రూ.80 లక్షలు, హైస్కూల్ రోడ్డుకు రూ.21 లక్షలు, బీసీ కాలనీ నుండి ఎస్టీ కాలనీ వరకు రూ.40 లక్షలు, కొత్త వేలేరు సీసీ రోడ్డుకు రూ.11 లక్షలతో పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను ఆయన అభినందించారు. చదివిన పాఠశాలకు సహాయం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రాపౌట్స్ తగ్గించి, ప్రతి విద్యార్థికి మంచి విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గన్నవరం వెనుకబడిందని విమర్శించిన ఆయన, రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.బాపులపాడు ఎంపీడీవో జోగేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ మల్లిక, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, గన్నవరం ఏ.యం.సి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, గరికపాటి శివశంకర్, మొవ్వ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు తోట మురళీధర్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, కాజా సురేష్, అవిర్నేని భవాని శంకర్, అంగడాల సీతారామస్వామి, దోనవల్లి రామారావు, అవిర్నేని హేమ సూర్యప్రసాద్, రాచప్రోలు సతీష్, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు, మొవ్వ వేణుగోపాల్, కలపాల కుమార్, దుట్టా శివన్నారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, చలసాని శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్, సుంకర రాజా వేణుగోపాల్, లంకా అజయ్, వి.ఎస్.ఆర్ కృష్ణ ప్రసాద్ (నాని), కొల్లి లక్ష్మీ నారాయణ, ఆర్నేపల్లి సూరిబాబు,అన్నే చైతన్య, గరికపాటి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసరావు, చెన్నుబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News