Breaking News

సింగపూర్ రెండో రోజు ఏపీ మంత్రుల బృందం పర్యటన

-దేశ ప్రాధాన్యతతో పాలన, సింగపూర్ మోడల్‌పై మంత్రుల అధ్యయనం
-సమగ్ర పాలన, పట్టణ ప్రణాళికపై సింగపూర్‌లో రెండో రోజు మంత్రుల పర్యటన విజయవంతం

సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త :
సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల అధ్యయన పర్యటనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు సుసంపన్నంగా కొనసాగాయి. “Nation-First Governance & Political Philosophy – Political Accountability & Sustained Public Trust” అనే ప్రధాన అంశంపై మంత్రుల బృందం వివిధ సమావేశాల్లో పాల్గొని సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసింది. ఉదయం నలాన్ లిటిల్ ఇండియా ప్రాంతంలో సింగపూర్ హోం మంత్రి శన్ముగంతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రాధాన్యత ఆధారిత పరిపాలన, బాధ్యతాయుత రాజకీయ వ్యవస్థ, ప్రజల రక్షణకు చర్యలు, చట్టాలపై ఆయన తన అనుభవాలను ఏపీ మంత్రులతో పంచుకున్నారు. తదుపరి సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్‌లో డాక్టర్ ప్రేమ్ కుమార్ సమన్వయంతో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సమగ్ర సమన్వయ విధానంపై మాజీ హెడ్ ఆఫ్ సివిల్ సర్వీస్ పీటర్ హో ఏపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వ విభాగాల సమన్వయం ద్వారా సమగ్ర అభివృద్ధిని ఎలా సాధిస్తున్నారో ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం యూఆర్‌ఏ గ్యాలరీను సందర్శించిన మంత్రులు పట్టణ ప్రణాళిక, భూవినియోగ పాలనపై అవగాహన పొందారు. సింగపూర్ నగరాభివృద్ధి విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళిక, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలపై సింగపూర్ ప్రతినిధులు వివరించారు. తరువాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో జరిగిన సెషన్‌లో దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, సమగ్ర ప్రణాళిక, సమన్వయ వ్యవస్థలు వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా ప్రజా నమ్మకాన్ని పెంపొందించే విధానాలు, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకుంటున్నారని ఏపీ మంత్రులు తెలిపారు. ఈ అనుభవాలను మన రాష్ట్రంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రుల బృందంలో పి. నారాయణ, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బి.సి జనార్దన్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీ అనంత్ శంకర్, APSDPS ED ఆలపర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇండియన్ హై కమిషనర్‌తో ఏపీ మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *