Breaking News

అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాల పేదలకు(ఈడబ్ల్యూఎస్ వర్గీయులు) కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, వారి పేదరికాన్ని పారదోలేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఉండేలా ఒకే సముదాయంలో కమ్మ కార్పొరేషన్, పాలకమండలి సభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కొద్ది రోజుల కిందట ఎంఎస్ఎంఈ పార్కుల్లో వ్యాపార అవకాశాలపై మరో సదస్సు నిర్వహించామన్నారు. ఏయే రంగాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుందో వాటిపై ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సులు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు గౌరవప్రద జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగా కల్పించి తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఘనత అంతా సీఎం చంద్రబాబుది, మంత్రి లోకేశ్ దేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఉద్యోగాల కల్పనే కాకుండా.. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ప్రతి నియోజక వర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఆ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువతకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కూడా పెద్దపీట వేస్తున్నామన్నారు. బీసీ కులాలతో పాటు అగ్ర కులాల్లో పేదరికాన్ని రూపు మాపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల మధ్య కార్పొరేషన్ కార్యాలయాన్ని, చైర్మన్ ఛాంబర్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, ఆప్కాస్ చైర్మన్ రాంప్రసాద్, పలువురు డైరెక్టర్లు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *