Breaking News

ఏపీ సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌ (FAC)గా బాధ్యతలు స్వీకరించిన జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 23, 2026వ తేదీ గురువారం ఉదయం జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ అడిషనల్ కమిషనర్‌(ఫుల్ అడిషనల్ ఛార్జ్-FAC)గా బాధ్యతలు చేపట్టారు. CRDA ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో ప్రవీణ్ చంద్ గారు బాధ్యతలు స్వీకరించారు.
రాయపూడిలోని కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత APCRDA కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్ కి సిఆర్డీఏ కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్‌, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, HR విభాగ డైరెక్టర్ బి.మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *