Breaking News

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు
-సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు భద్రతకు తోడ్పడనున్న వాహన ఫిట్‌నెస్ సెంటర్…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కపుగున్నేరి గ్రామంలో విష్ణు వెహికల్ వెల్నెస్ టెస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (వాహన ఫిట్‌నెస్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్రాన్ని ప్రారంభించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం రోడ్డు భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఇలాంటి సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సంస్థ ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *