Breaking News

రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.సాయిప్రసాద్  శ‌నివారం ప‌రిశీలించారు. అమరావతి పర్యటనలో CS తో పాటు ఏపీ సిఆర్డీఏ క‌మిష‌న‌ర్ వి.విజ‌య‌రామ‌రాజు, ఏడీసీ సీఎండీ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఏజీఐసీఎల్ ఎండీ ఎస్‌.వి.ఆర్‌.శ్రీ‌నివాస్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు ఎ.భార్గ‌వ‌తేజ‌, కొల్లాబ‌త్తుల కార్తీక్, జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

అమరావతి పర్యటనలో భాగంగా ముందుగా బకింగ్‌హామ్ కెనాల్ మీద సీడ్‌యాక్సిస్ రోడ్డు ఫేజ్‌-3లో జ‌రుగుతున్న స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను సిఎస్ ప‌రిశీలించారు. ఇది క‌ర‌క‌ట్ట రోడ్డుకు ప్ర‌త్యామ్నాయంగా సీడ్‌ యాక్సిస్ రోడ్డుకు కొన‌సాగింపుగా నిర్మాణం జ‌రుపుతున్నామ‌ని ఏడీసీ సీఎండీ ల‌క్ష్మీపార్థ‌సార‌థి వివ‌రించారు. దీనికి కొన‌సాగింపుగా కొండ‌వీటివాగు మీద జ‌రుగుతున్న మ‌రో స్టీల్ బ్రిడ్జి ప‌నులను వివ‌రించారు.

అనంత‌రం సీడ్‌యాక్సిస్‌రోడ్డు మీదుగా అబ్బ‌రాజుపాలెం వ‌ద్ద రాజ‌ధాని రైతుల‌కు అభివృద్ధిప‌రిచి ఇచ్చే ఎల్‌పీఎస్ జోన్ – 5Dని CS  సంద‌ర్శించారు. 1,158.42 ఎక‌రాల‌లో రూ.470.42 కోట్ల వ్య‌యంతో నిర్మాణంలో ఉన్న ఈ జోన్‌లో రైతుల‌కిచ్చే 1,638 ప్లాట్ల‌ అభివృద్ధి గురించి వివ‌రించారు. 5డి ఎల్పీఎస్ జోన్‌ను నాలుగు బ్లాకులుగా అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. 37.10 కి.మీ. మేర అంత‌ర్గ‌త ర‌హ‌దార్ల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. అదేవిధంగా 34.01 కి.మీ. మేర సీవ‌రేజి నెట్‌వ‌ర్క్‌, 76.19 కి.మీ. మేర స్ట్రామ్ వాట‌ర్ డ్ర‌యిన్ల అభివృద్ధి, 297.08 కి.మీ. విస్తీర్ణంలో చేప‌డుతున్న ప‌వ‌ర్ మ‌రియు ఐసీటీ నెట్‌వ‌ర్క్‌, 78.30 కి.మీ.ల‌తో రీయూజ్ నెట్‌వ‌ర్క్ వంటి అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.

అనంత‌రం రాజ‌ధాని అమ‌రావ‌తి- అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని ఐకానిక్ ట‌వ‌ర్లను ప‌రిశీలించారు. సాధార‌ణ ప‌రిపాల‌నా భ‌వ‌నం అయిన జీఎండీ ట‌వ‌ర్‌ను ప‌రిశీలించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌తో పాటు సాధారణ ప‌రిపాల‌న యంత్రాంగమంత‌టికీ క‌లిపి 50 అంత‌స్తుల‌లో ఈ ట‌వ‌ర్‌ను నిర్మిస్తున్నట్లు ఎస్‌వీఆర్ శ్రీ‌నివాస్ వివ‌రించారు. అదేవిధంగా ప్ర‌భుత్వ విభాగాధిప‌తుల‌కు నాలుగు ట‌వ‌ర్లు నిర్మిస్తున్న‌ట్లు సీఎస్ కి వివరించారు. నాలుగు ట‌వ‌ర్ల‌కు గాను ఒక్కో ట‌వ‌ర్లో 40 అంత‌స్తుల‌లో నిర్మాణం చేప‌డుతున్నామ‌న్నారు. వీటికి గాను రూ.4,820 కోట్లు ఖ‌ర్చు చేస్తు్న్న‌ట్లు వివ‌రించారు. వ్యూ పాయింట్ నుంచి ట‌వ‌ర్ల నిర్మాణాలను ప‌రిశీలించారు. ఐకానిక్ కోర్‌వాల్వ్ పురోగ‌తిలో ఉన్నాయ‌ని, స్ట్ర‌క్చ‌ర‌ల్ స్టీల్ ఫ‌ర్ డ‌యాగ్రిడ్ కాల‌మ్స్- నోడ్స్ గురించి CS కి వివ‌రించారు. అనంతరం రాయపూడిలో ఏపీ సిఆర్డీఏ కార్యాల‌యాన్ని సీఎస్ జి.సాయిప్ర‌సాద్ సందర్శించారు. CS కి APCRDA అధికారులు స్వాగతం పలికారు. సిఆర్డీఏ కార్యాలయంలో APCRDA, ADCL , AGICL ఇతర ముఖ్య అధికారుల‌తో CS స‌మావేశ‌మ‌య్యారు. ఏపీ సిఆర్డీఏ క‌మిష‌న‌ర్ వి.విజ‌య‌రామ‌రాజు  రాజ‌ధాని అమ‌రావ‌తి భౌగోళిక స్వ‌రూపాన్ని, ఆయా ప్రాజెక్టుల పురోగతిని ప్రజంటేషన్ ద్వారా వివ‌రించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *