Breaking News

వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసిన ఏపీ BOCWA బోర్డు చైర్మన్ గొట్టుముక్కల.

విజయవాడ( సెంట్రల్) కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో ముఖ్యమంత్రి వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ప్రతి నియోజకవర్గంలో నాయకులు మెడికల్ క్యాంపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31 డివిజన్ రామకృష్ణాపురం ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రామరాజు కన్వెన్షన్ నందు ఏపీ(BOCWA) బోర్డు చైర్మన్ గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ జనరల్ ఫిజీషియన్ కంటి చికిత్సలు మరియు ఉచిత మందులను కూడా అందించారు

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని వైద్య రంగానికి ముఖ్యమంత్రి ఎనలేని సేవలందిస్తున్నారని తెలియజేశారు ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలియజేశారు. పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కూటమి ప్రభుత్వంలో చక్కగా అందుతున్నట్లు తెలియజేశారు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని నాయకులు కిందిస్థాయి వరకు తీసుకువచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ అవసరం ఉందని ఆ దిశగా ప్రభుత్వం ప్రవేట్ రంగం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ మెడికల్ క్యాంపులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు నాగవంశం చైర్మన్ ఎర్రబోతు రమణారావు సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు చరణ్ సాయి యాదవ్ మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *