విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఐఏఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు 43వ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్విరామంగా కొనసాగుతున్నాయని యువజన సర్వీసుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిబ్బంది కొరత రీత్యా యూత్ టైం బ్యాంక్ సర్వీసులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో మార్చి 16వ తేదీన ప్రారంభించారు. అప్పటినుండి ఈరోజు వరకు నిర్విరామంగా యూత్ టైం బ్యాంక్ సేవలు రోజుకి ఒక కాలేజ్ చొప్పున 30 నుంచి 40 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు టైం బ్యాంక్ సేవలో పాల్గొని వయోవృద్ధులకు, వికలాంగులకు, నడవలేని వారికి మరియు నిరక్షరాస్యులకు వారు హాస్పిటల్ ఆవరణంలోకి వచ్చిన వెంటనే వారికి ఓపిడి తీసి ఇవ్వడం, డాక్టర్ ను సంప్రదించడం, టెస్టులు చేయించడం మందులు తీసి ఆటో ఎక్కిచ్చేంత వరకు పేషెంట్ కి యూత్ టైం బ్యాంకు వాలంటీర్లు తోడుగా ఉండి వారికి వెచ్చించిన టైంను యూత్ టైం బ్యాంకులో నమోదవుతుంది. ఈ రోజు ఎస్ ఆర్ కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 60 మంది సేవలు అందించారు. ఈ సేవలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసినవారికి కలెక్టర్ గారు మెరిట్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఎన్జీవోలు భాగస్వామ్యం పొందాలని మరియు డిగ్రీ విద్యార్థులు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, ఇంటెన్షిప్, అప్రియెంటెన్షిప్ చేయదలచుకున్న వారు యూత్ టైం బ్యాంకు ఉపయోగించుకోవాలని వారి పని గంటలు పూర్తి అయిన తర్వాత వారికి కలెక్టర్ గారిచే సర్టిఫికెట్ ఇస్తామని, ఈ సేవలు ఉపయోగించుకోవడం వల్ల పేషంట్లకు, కళాశాలకు, జిల్లాకు మంచి పేరు వస్తుందని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఇలాంటి సేవలను చేయదలుచుకున్నవారు ముఖ్యకారినిర్వాహణాధికారి, యువజన సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా మొబైల్ నెంబర్ ను 9849909069 సంప్రదించవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News