Breaking News

మానసిక శారీరక వికాసానికి సమ్మర్ క్యాంప్ ని వినియోగించుకోండి- దరఖాస్తులకు నేడే చివరి తేదీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారుల మానసిక మరియు శారీరక వికాసానికి విజయవాడ నగరపాలక సంస్థ వారు మే 1 నుండి 30, 2026 వరకు నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. ఈ వేసవి శిక్షణలో పాల్గొనాలంటే దరఖాస్తులకు ఏప్రిల్ 30, 2026 చివరి తేదీ అని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 16 స్పోర్ట్స్ కేంద్రాలలో షటిల్ బ్యాడ్మింటన్ , స్విమ్మింగ్, క్రికెట్, స్కేటింగ్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ మరియు యోగ లలో వేసవి శిక్షణను నిర్వహిస్తున్నారని అన్నారు. సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ గాంధీనగర్ , కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ చిట్టీనగర్, గురునానక్ కాలనీ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్, డిఆర్ ఆర్ ఇండోర్ స్టేడియం యం.జి రోడ్డు , చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం పటమట , గాంధీజీ ఇండోర్ స్టేడియం వన్ టౌన్లో…షటిల్ బ్యాడ్మింటన్, రోస్ గార్డెన్ పార్క్ భవానీపురం , జీవీఎస్ శాస్త్రి పార్క్ సత్యనారాయణపురం , రాజీవ్ గాంధీ పార్క్లో వన్ టౌన్ స్కేటింగ్, పగోడా పార్క్ వన్ టౌన్ , కేదారేశ్వరపేట పార్క్లో క్రికెట్, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, పటమట లో టేబుల్ టెన్నిస్ మరియు యోగ లో వేసవి శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *