Breaking News

‘ది లాన్సెట్‌’ లో కేజీహెచ్ వైద్యుడి భాగస్వామ్య పరిశోధన పత్రం ప్రచురితం

-వైద్యారోగ్య శాఖా మంత్రి  సత్యకుమార్ యాదవ్ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత ప్రతిష్టాకరమైన ‘ది లాన్సెట్‌’ (ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్)లో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) పేరు మెరిసింది. చిన్నారులు న్యూమోనియా బారినపడకుండా ఉండేందుకు ఉపయోగించే న్యూమోకొకల్ వాక్సిన్ పరిధిని విస్తృతం చేసేందుకు దేశ వ్యాప్తంగా 7 వైద్య రంగ సంస్థలు పరిశోధన చేపట్టాయి. ఇందులో విశాఖ కేజీహెచ్ ఒకటి కాగా, కర్ణాటక, తెలంగాణా, హర్యానా రాష్ట్రాలకు చెందిన సంస్థలు ఆరు ఉన్నాయి. ఈ 7 భాగస్వామ్య సంస్థలు 400 మంది చిన్నారులపై పరిశోధన చేశాయి. వీరిలో 148 మంది చిన్నారులను విశాఖ కేజీహెచ్ చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ చక్రవర్తి పరీక్షించారు. ఈ పరిశోధన 2023-2024 మధ్య జరగ్గా ది లాన్సెట్ రీజనల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్’ లో గత మార్చి నెలలో ప్రచురితమైంది.

ప్రమాదకర వ్యాధుల్లో న్యూమోనియా ఒకటి..|

దేశంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే ప్రమాదకర వ్యాధుల్లో న్యూమోనియా ఒకటి ఈ న్యూమోనియా మెదడు పొరల ఇన్ఫెక్షన్ (మెనింజైటిస్), రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది.
ఈ నేపథ్యంలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా న్యూమోనియా వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి మునుపటి కంటే మరిoత రక్షణ ఇస్తుందని డాక్టర్ చక్రవర్తి తెలిపారు. ముఖ్యంగా 22ఎఫ్, 33ఎఫ్ స్ట్రెయిన్ల నుంచి కూడా రక్షణ లభించిందన్నారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం మరింత మెరుగుపడడమే కాకుండా మరణాలు కూడా
తగ్గుతాయని డాక్టర్ చక్రవర్తి తెలిపారు. శాస్త్రీయ విధానంలో ఆధారాలతో సహా నిరూపించామని తెలిపారు.

చక్రవర్తిని ప్రశంసించిన మంత్రి సత్యకుమార్

పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ చక్రవర్తి సహచర వైద్యులకు ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. పరిశోధనల్లో వైద్యులు భాగస్వామ్యులు కావడం ద్వారా రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈ లక్ష్య సాధనకు వైద్యులందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కేజీహెచ్ ప్రధాన భాగస్వామ్యంతో జరిగిన పరిశోధన పత్రం అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితంకావడంపట్ల డాక్టర్ చక్రవర్తిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్ట‌ర్‌ వాణి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి కూడా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *