– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్రోల్, డీజిల్ కొరత గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో వెన్నాడుతున్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొరత ఏమీలేదని చెప్పడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తప్ప్పుబట్టారు. డీజిల్, పెట్రోల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందన్నారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. కాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పెట్రోల్, డీజిల్ కొరత ఏదీలేదని, పుకార్లను నమ్మవద్దని, గ్యాస్ కూడా సమృద్ధిగా దొరుకుతుందంటూ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. కాని వాస్తవానికి నిన్న జడ్చర్ల నుండి హైదరాబాద్ వచ్చేటప్ప్పుడు పరిశీలిస్తే పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టి, లైట్లు కూడా ఆఫ్ చేసుకుని మÖసేయడం జరిగింది. పెట్రోల్, డీజిల్ కష్టాలు ఇంత తీవ్రంగా ఉంటే కిషన్‌రెడ్డి అసలు కొరతేమీలేనట్లుగా మాట్లాడడం చూస్తే ఆయన నిద్ర పోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
దాదాపు ఒక నెలన్నరగా గ్యాస్ దొరకక ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. అత్యధిక హోటళ్ల వారు మÖడురెట్ల ధర అధికంగా వెచ్చించి, గ్యాస్‌ను కొనుగోలు చేశారు. ఇళ్లలో వంటగ్యాస్ కొరత వల్ల వంట చేయలేని పరిస్థితి నెలకొనగా విద్యుత్ స్టవ్‌ల వైపు మళ్లడం జరిగింది. గత కొద్దిరోజులుగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ దొరకక బంకుల వద్ద పెద్దఎత్తున క్యూలు కడుతున్నారు. మరోవైపు డీజిల్ కొరతతో దిగుబడి తగ్గిపోయి, రైతులను నష్టాలు జరుగుతున్నాయి. డీజిల్, పెట్రోల్ కొరత ఇంత తీవ్రంగా ఉంటే అన్నీ సజావుగానే ఉన్నట్లు కేంద్ర పాలకులు మాట్లాడడం సరైందికాదు. డీజిల్, పెట్రోల్ కొరత ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది. ఈ సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు.
ప్రజలెన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాజకీయాలు కావాలి. ఎన్నికలలో ఎలా గెýవాలి. అందుకోసం ఎలాంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టాలి. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపైనే ప్రత్యేక ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదు. కమÖ్యనిస్టు పార్టీ శ్రేణులు పెట్రోల్, డీజిల్ కొరతపై ఇప్పటికే ఉద్యమం చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర నటించడం మాని, సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News