Breaking News

నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కి అర్జునరావు అన్నారు. గురువారం ఉదయం 63వ డివిజన్ ఓల్డ్ రాజు శర్మ కమ్యూనిటీ హాల్ ఏరియా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏరియా, రంగా బొమ్మ రోడ్డు, సుందరయ్య నగర్ కట్ట, గాయత్రి స్కూల్ బ్యాక్ సైడ్ ఏరియా, మజీద్ సెంటర్ నందు శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు ప్రజారోగ్యం సిబ్బంది. 109 ప్రజారోగ్యం సిబ్బందితో ఈ డ్రైవ్ ని నిర్వహించారు.

ఈ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ఎక్కడ పారిశుధ్య నిర్వహణలోపం లేకుండా రోడ్లను ఓడవటం, డివైడర్ల వద్ద మట్టి లేకుండా చూసుకోవటం, సైడ్ కాలువల్లో పూడికలును తొలగించటం, తొలగించిన వ్యర్ధాలను బాబ్కాట్లతో తీసేయటం, ప్రధాన రహదారులలో స్లీపింగ్ మెషిన్ ఉపయోగించడం ద్వారా ఈ శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు.

దీనిలో భాగంగా శనివారం బందర్ రోడ్డు, సోమవారం రామరుప్పాడు నుంచి పాత బస్టాండ్ వరకు, మంగళవారం బి ఆర్ టి ఎస్ రోడ్డు మరియు బుధవారం రామవరప్పాడు ఇన్నోటల్ హోటల్ నుంచి గుణదల వరకు ఉన్న బ్రిడ్జ్ ఇరువైపులా, గురువారం 63వ డివిజన్లో శానిటేషన్ నిర్వహిస్తున్నట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ముఖ్యంగా ఈ శానిటేషన్ డ్రైవ్ లో 109 మంది శానిటేషన్ వర్కర్లని ఉపయోగించి, డివైడర్ క్లీనింగ్, స్వీపింగ్, బస్ స్టాప్ క్లీనింగ్, ట్రై బీన్స్ క్లీన్ చేసి వాటికి స్టిక్కర్స్ అంటించడం, డ్రైన్ క్లీనింగ్ లు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా 2 బాప్ కాట్లు, 2 ట్రాక్టర్స్, 2 నాలా మెన్స్ , 1 జేసీబీ, 1 ట్రాక్టర్ ఉపయోగిస్తున్నారని, ఈ వర్క్స్ ని పర్యవేక్షించడానికి మెడికల్ హెల్త్ ఆఫీసర్లు అన్నపూర్ణ , గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్ సలీం, మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈ డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *