Breaking News

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం

-నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
-15 రోజుల్లో పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ
-తదుపరి నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ అపరాధ రుసుంతో పాటు చట్టపరమైన చర్యలు
-వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై చర్యలు
-పర్యవేక్షణ, చర్యలు తీసుకోవడానికి 12 ప్రత్యేక నిఘా బృందాలు
-జిల్లా కలెక్టర్, జిఎంసి ప్రత్యేక అధికారి సాయికాంత్ వర్మ, కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుందర గుంటూరు నగర రూప కల్పనలో భాగంగా నగరాన్ని”పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్, జిఎంసి ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, నిబందనలు మీరి పోస్టర్స్ అంటించే వారు, ప్రింటింగ్ ప్రెస్ లపై కూడా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనధికార బ్యానర్లు, హోర్డింగ్స్, పోస్టర్స్ ని పట్టణ ప్రణాళిక అధికారుల నేతృత్వంలో తొలగించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విచ్చలవిడిగా వాల్ పోస్టర్స్ అంటిస్తున్నారని, ఇక నుండి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి 12 బృందాలను నియమించామన్నారు. తొలిదశలో 15 రోజుల్లో నగరంలోని పోస్టర్స్, అనధికార బ్యానర్లు, ఫ్లేక్సీలు, జంక్షన్లలో బోర్డ్ లను తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామన్నారు. పోస్టర్స్ అంటిస్తే ఒక్కో పోస్టర్ కి మొదటిసారి రూ.5 వేలు, రెండో సారి రూ.10వేలు, 3వసారి రూ.50 వేలు అపరాధ రుసుం విధించి, పోలీసు కేసు కూడా నమోదు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. అలాగే సదరు గడువు అనంతరం పోస్టర్స్ అంటిస్తే వారే శుభ్రం చేసి, పెయింటింగ్ చేయాల్సిన భాధ్యత కూడా వారే వహించాల్సి ఉందన్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, కార్యాలయాల గోడలు, బ్రిడ్జిల గోడలు మరియు బహిరంగ ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టే వారు, పోస్టర్లు అంటించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అటువంటి వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సెంట్రల్ డివైడర్లలో కూడా లాలిపప్స్ వంటి ప్రకటనల బోర్డ్ లను కూడా తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశామన్నారు. ప్రత్యెక బృందాలు వాల్ పోస్టర్స్ అంటించిన వారిని గుర్తించి, పోలీసు కేసు నమోదు చేస్తారన్నారు. రాత్రి సమయంలో పోస్టర్స్ అంటించడం, బ్యానర్లు కట్టే వారిపై కూడా నిఘాకి సిబ్బందిని కేటాయించామన్నారు. అలాగే వాల్ పోస్టర్స్ ప్రింటింగ్ నిషేదమని, ఫ్లెక్సీలు కూడా ప్రింట్ చేయాలి అంటే తప్పనిసరిగా ప్రింటర్, ప్రింటింగ్ ప్రెస్ పేరు, వివరాలు ప్రతి బ్యానర్ పై ఉండాలని, లేకుంటే ఇరువురిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా ఏ విధమైన పోస్టర్స్ ని ప్రింటర్స్ ప్రింట్ చేయడానికి వీలు లేదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *