Breaking News

పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం టిటిడి కళ్యాణ మండపం రోడ్డు, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరావు పంతులు రోడ్డు, BRTS రోడ్, సత్యనారాయణపురం ప్రాంతాలని పర్యటించి పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. బావాజీ పేట పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పింఛను తీరును పరిశీలించారు.

ఆ ప్రాంతంలో గల ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా? ఎంత పెన్షన్ వస్తుంది? ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడితెలుసుకున్నారు. ప్రతి నెల సమయానికి పెన్షన్ సిబ్బంది అందిస్తున్నారని ఎటువంటి సమస్యలు లేదని వారు తెలుపగా సంతృప్తి చెందారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అక్కడున్న పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా తానే ఎఫ్ ఆర్ ఎస్ తీసి పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల వరుకు, సర్కిల్ వన్ పరిధిలో 19,873 పెన్షన్ లకు గాను 18,068, సర్కిల్ 2 పరిధిలో 25,301 పెన్షన్ లకు గాను 22,891, సర్కిల్ 3 పరిధిలో 19,999 పెన్షన్ లకు గాను 17,813, మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 65,173 పెన్షన్ లకు 58,772 పెన్షన్ల పంపిణీ చేశారని, అంటే దాదాపు 90% పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, పి.ఓ (యూ సి డి) యం. విజయ లక్ష్మి, సిడిఓ జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *