గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బాల కార్మికులతో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఎల్లపు సాయి కుమారుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు ఉప కార్మిక కమీషనరు ఏ.గాయత్రి దేవి తెలిపారు. ఈనాడు దిన పత్రికలో “మురుగుపాలైన బాల్యం” శీర్షికన ఆదివారం ప్రదురితమైన వార్తపై గాయత్రి దేవి స్పందిస్తూ వివరాలు అందించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి.పద్మలత ఈ సంఘటనపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర మురుగు కాలవల మురుగు తీస్తున్న ప్రదేశాన్ని ఉప కార్మిక కమీషనరు, సహాయ కార్యక అధికారి సందర్శించి, కాంట్రాక్టర్ ఎల్లపు సాయి కుమారుతో మాట్లాడి, బాలకార్మికునితో హానికరమైన పనిచేయించినందుకు గాను షోకాజ్ నోటీసు, డిమాండ్ నోటీసును జారీ చేయడం జరిగిందని వివరించారు. కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
Prajavartha Online Telugu News