– ఇగ్నైట్ సెల్లో ఆర్టీఐహెచ్ స్టార్టప్ ప్రదర్శన
– యువ ఆవిష్కర్తలకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్‌టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చేయూతనందిస్తున్నామని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
నగరంలోని కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్లో సోమవారం ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో స్టార్టప్ ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించి, స్టార్టప్‌లు రూపొందించిన వినూత్న ఉత్పత్తులను పరిశీలించారు. క్యామార్టెస్, సాయిల్ స్మార్ట్, అయోధ్య ఆర్గానిక్ ఫార్మ్స్, హ్యాండ్‌మేడ్ గ్యాలరీ, కైవల్య జూట్ క్రియేషన్స్ వంటి స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శన ద్వారా ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తూ, స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో ఆర్టీఐహెచ్ చేస్తున్న కృషి వెల్లడైంది.
యువ పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్న ఆవిష్కరణలను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు స్టార్టప్‌ల అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ లక్ష్మీశ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలకు అనుగుణంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో జి.కృష్ణన్, ఆర్టీఐహెచ్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ అనిల్ కుమార్ మున్నంగి, ఇమ్మానుయేల్, సురేఖ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News