-మే 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
-విజయవాడ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు
-భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన
-భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నూతనంగా పునఃనిర్మించిన శ్రీ కామావతి సమేత బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. విజయవాడలోని ఆయన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మే 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ప్రతిష్ఠాత్మక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులతో యార్లగడ్డ చర్చించారు. అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టిన ఈ పునఃప్రతిష్ఠా ఉత్సవాలలో సతీసమేతంగా పాల్గొని, స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సాదరంగా కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి, స్వామివారి ఆశీస్సుల కోసం ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ దివ్యమైన వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు దన్నే దుర్గారావు, జాస్తి భూపతి, ఏఎంసీ డైరెక్టర్ మున్నంగి శేషగిరిరావు, చలసాని శ్రీనివాసరావు, ఎనికెపల్లి శ్రీనివాసరావు, అన్నే చైతన్య, చేనుబోయన బీరయ్య, పడకల శేఖర్, చేనుబోయన రాము, మాయర పూర్ణ, చేనుబోయన వెంకటేశ్వరరావు, దన్నే మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News