విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా మేము స్వయంగా వండి వడ్డంచే ఈ కార్యక్రమం అనేకమంది ఆకలి తీర్చడానికి మేము చేసే ఈ సేవలో అనేకమంది మంచి మనసున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మేము చేసే అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదానంగా చేయడానికి మా ట్రస్ట్ లోకి ఇంకా అనేకమంది మంచి మనసున్న వ్యక్తులు రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నారాయణ, సురేష్, అనేకమంది టీడీపీ పార్టీ నాయకులు హాజరయ్యారు. నేను అన్నదానం చేయడానికి మేమున్నాము అంటూ ముందుకు వచ్చిన ట్రస్ట్ మెంబర్స్ సంసాని విజయలక్ష్మి,గుబ్బల జ్యోతిశ్వరి, దాసరి ప్రశాంతి, ఉడత వినీత, జార్జ్ అందరికీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, టిడిపి పార్టీ సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయ కుమారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
Prajavartha Online Telugu News