గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రేషన్ కార్డులోని సభ్యులందరూ తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ తెలిపారు. ఇకెవైసి పూర్తి చేసుకొనుటకు ఇప్పటికే అనేక సార్లు అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో మొత్తం 5,92,889 రేషన్ కార్డు ఉన్నాయని, రేషన్ కార్డులోని సభ్యులందరూ తప్పనిసరిగా ఇకెవైసి పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని చెప్పారు.
ఇప్పటికీ కొంత మంది ఆ ప్రక్రియను పూర్తి చేసుకోలేదని చెప్పారు. జిల్లాలో అన్ని రేషన్ కార్డులలో గల 16,74,646 మంది సభ్యులు ఉండగా ఇప్పటి వరకు 16,43,743 మంది మాత్రమే ఇకెవైసి చేసుకున్నారని చెప్పారు. ఇంకా 20,993 మంది ఇకెవైసి చేయించుకోవలసి ఉందన్నారు. ఈ సారి చివరి అవకాశంగా మిగిలిన 20,993 మంది రేషన్ కార్డుదారులు వారికి సమీపంలో గల రేషన్ షాపులలో గాని, సచివాలయంలో గానీ సంప్రదించి వెంటనే ఇకెవైసి పూర్తి చేసుకోవాలని
విజ్ఞప్తి చేశారు. ఇకెవైసి చేసుకోనివారికి భవిష్యత్తులో రేషన్ పంపిణీ విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు.
Tags guntur
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News