Breaking News

మెప్మా కార్యక్రమాలు పై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘స్వయం’ బ్రాండ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒక ప్రామాణికత (Standardization), ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ కల్పించి, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వేదికల ద్వారా విస్తృతంగా మార్కెటింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మెప్మా కార్యకలాపాలపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మెప్మా మిషన్ డైరెక్టర్, ఏఎండి, ఎస్ఎంఎం ఇతర మెప్మా అధికారులతో ఈరోజు ఏ.పి.సి.ఆర్.డి.ఏ భవనమునందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొబైల్ బుక్ కీపింగ్, మన డబ్బులు మన లెక్కలు, ఈఎంసిపి, యాన్యువల్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించి తగు సూచనలు తెలిపారు. ఎస్ హెచ్ జి (SHG) స్వయం సహాయక సంఘాల జీవనోపాధిని మెరుగుపరచడానికి, వారి తలసరి ఆదాయం పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.
అందులో భాగంగా మెప్మా మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ, IAS, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కి ‘స్వయం’ బ్రాండ్ ఉత్పత్తుల అభివృద్ధి, ప్రమాణీకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ వ్యూహాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో SHG ల నుండి 10–15 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి, వాటిని పూర్తిగా ప్రామాణీకరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ గుర్తింపు ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన నమూనాలను చూపించారు.
సమీక్షలో భాగంగా ఎంపిక చేసిన ఉత్పత్తులన్నింటి మోడల్స్, ప్రతిపాదిత ప్యాకేజింగ్, బ్రాండింగ్ నమూనాలు, AP బ్రాండ్ ప్రతిరూపంతో కలిసి మంత్రికి ప్రదర్శించారు. ‘స్వయం’ బ్రాండ్ కింద సిద్ధం చేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయించే వ్యూహాన్ని కూడా ఎండీ మేడమ్ వివరించారు.
స్వయం బ్రాండ్ ద్వారా SHG ఉత్పత్తులకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మార్కెట్లలో విస్తృత ప్రాచుర్యం లభించి, మహిళా సభ్యులకు స్థిరమైన మరియు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని సమావేశంలో తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలన్నిటికీ ఈ సౌకర్యాన్ని దశల వారీగా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎండీ మేడమ్ వివరించగా, మంత్రిగారు ఈ చర్యలను అభినందించారు. పట్టణ మహిళలకు సుస్థిర ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు ‘స్వయం’ బ్రాండ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *