తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు లోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. తిరుచానూరు శాఖ గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల సందర్శించినచైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి తో పాటు ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రసంగించారు . చైర్మన్ గురువారెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులుకూట మీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారి సారధ్యంలో గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నాం అన్నారు ఈ శిబిరాల ద్వారావిద్యార్థులకు పుస్తక పఠనం విద్యార్థులకు అలవాటు చేయడం నాయకత్వ లక్షణాలు మంచి ఉపన్యాసకులుగా తీర్చిదిద్దడం కథలు చెప్పడం, , యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ డ్రాయింగ్ పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో విధానాన్ని కంప్యూటర్ పరిజ్ఞానం యోగా ధ్యానం తదితర అంశాలను నేర్పిస్థామని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిబిరం కూటమి ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసింది అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కొని వారి సృజనాత్మకతను వెలికి తీయాలని లక్ష్యముతో మీ మేధాశక్తిని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు ఈ యొక్క శిబిరాలను విద్యార్థులు 5వ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నవారు వినియోగించుకొని తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు గ్రంథాలయాల అనేటివి సరస్వతి దేవి నిలయాలు మీకు విజ్ఞానాన్ని పెంపొందించే జ్ఞానబండాగారాలు అన్నారు ఈరోజు గౌరవ విద్యా మంత్రివర్యులు నారా లోకేష్ గారు విదేశాల్లో విద్యా వ్యవస్థ పై అధ్యయనం చేయడం కోసం ఉపాధ్యాయులను ఒక బృందం గా ఏర్పాటు చేసి విదేశాలకు పంపి అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను వారు అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలోచనలను తీసుకొచ్చి మీకు నేర్పించే విధంగా నిర్ణయం తీసుకొని వారు ఉపాధ్యాయుని పంపడం వారికి విద్య లయాలపై ఉన్నటువంటి ఆలోచన అదే విధంగా మెరుగైనటువంటి విద్యను ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నేర్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ గారి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నామన్నారు దానికి నిదర్శనమే ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించడం నిదర్శనం అన్నారు గ్రంథాలయాల ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి ఎందరో ఐఏఎస్ నుండి టీచర్ వరకు ఉద్యోగ అవకాశాలు పొందారు అటువంటి గ్రంథాలయాలని మీరు కూడా విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం వైపు మొగ్గుచూపి క్రమశిక్షణతో సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాల అనే ఆశయంతో ఈ వేసవిజ్ఞాన శిబిరాలను కూటమిప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పద్మావతి దేవి నిలయమైనటువంటి తిరుచానూరులో గ్రంధాలయాన్ని శాసనసభ్యుల నాని గారి సహకారం తో స్థానిక నాయకుల ద్వారా పాఠకులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తాం అని గురువారెడ్డి అన్నారు అంతకుముందు చైర్మన్ గురువారెడ్డికి తిరుచానూరు పార్టీ అధ్యక్షులు కిషోర్ క్లస్టర్ ఇంచార్జ్ మధు నాయుడు సురేష్ వివిధ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర వన్నీ కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కలిసి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి తో పాటు క్లస్టర్ ఇంచార్జ్ మధు నాయుడు తిరుచానూరు పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయకులు థామ సాయిరాం రాయల్ సురేష్ సాల్మన్ రాజు జీవన్ కుమార్ పూర్ణచంద్ర చందు పెరుమాళ్ శేషాద్రి కుప్పయ్య వాసు గ్రంథాలయ అధికారి శ్రీముఖి తదితరులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News