విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం కు చెందిన మూడు ఎల్వోసీ లను గురువారం లబ్ధిదారులకు అంద చేశారు. 43 వ డివిజన్ కి చెందిన మొవ్వ పరిశుద్ధ బాబు కుమార్తె చిన్నారి శ్వాస సమస్య వైద్యం కోసం 18,04,600/- రూపాయలు, 44 వ డివిజన్ కి చెందిన సాగల కృష్ణ గుండె నాళాల సమస్య తో బైపాస్ సర్జరీ కోసం 9,05,000/- , 46 వ డివిజన్ కు చెందిన కొత్త సాంబ శివరావు హెర్నియా ఆపరేషన్ కు 3,25,000/- రూపాయలు వైద్య ఖర్చుల కోసం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖలు రాసారు. వీరికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను గురువారం భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం కార్యదర్శి దాసరి బుజ్జి, టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య , మైలవరపు దుర్గారావు, సుభాషిణి, జనసేన 43వ డివిజన్ అధ్యక్షులు బొల్లేపల్లి కోటేశ్వరరావు, సాయి శరత్, బిజెపి నాయకులు బుల్లా విజయ్ కుమార్, అవ్వరు బుల్లబ్బాయి, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News