Breaking News

పి.బి. సిద్ధార్థకు ఫైవ్ స్టార్ ర్యాంకింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) నిర్వహించిన క్వాలిటీ రేటింగ్ సర్వేలో ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ సాధించినట్లు హెచ్.వై.ఎం. సీఈఓ ఆలపాటి శివయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో ప్రిన్సిపల్ డా.మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావులకు ధ్రువపత్రాన్ని, జ్ఞాపికను అందచేసి అభినందించారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల విభాగంలో ఒక్క పి.బి. సిద్ధార్థ కళాశాలకు మాత్రమే ఐదు స్టార్లు లభించినట్లు శివయ్య తెలిపారు. మౌలిక వసతులు,విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం, ఉపాధి అవకాశాలు, డిగ్రీ మొదటి సంవత్సరంలో అత్యధిక అడ్మిషన్లు, గత ఐదేళ్ల కాలంలో డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వగైరా కొత్త కోర్సులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి సంస్థగా పి.బి. సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ ఇచ్చినట్లు శివయ్య తెలిపారు. ఇటీవల స్వర్ణోత్సవాలు జరుపుకున్న తమ కళాశాలకు ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ రావడం పట్ల యాజమాన్యం హర్షం వ్యర్థంచేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *