గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాధన్ సమరో 2026 లో భాగంగా సుప్రీం కోర్టులో ఆగష్టు 21,22,23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ లోక్ అదాలత్ సుప్రీం కోర్టులోనే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. పెండింలో ఉన్న కేసులు ప్రమాదాలకు సంబంధించి క్లయింలు, చెక్ బౌన్స్ కేసులు, భూ సేకరణ సమస్యలు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, htts://www.sci.gov.in సుప్రీం కోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్ సైట్ లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదు దారులు, కక్షిదారులు సుప్రీం కోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్ గా హాజరు కావొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు, 15100, 0863-222448 లను సంప్రదించవచ్చునని తెలిపారు.
Tags guntur
Check Also
అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …
Prajavartha Online Telugu News