Breaking News

లేబర్ అడ్డాలు ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కార్మిక శాఖ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పట్టణంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేయుటకు అనువుగావున్న స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి శుక్రవారం గుంటూరులో పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకర గుట్ట ప్రాంతాలను తనిఖీ చేశారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా… లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంటులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనులు నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే ఆచారం ఉందని, ఆయా పనులకు వెళ్ళగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి లేబర్ అడ్డాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో లేబర్ అద్దాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *