Breaking News

అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్గంధం చంద్రుడు IAS ఈ రోజు విజయవాడలోఉన్నలేబర్ అడ్డాలు అయిన బెంజ్ సర్కిల్ మరియు రాణిగారి తోట పాటుతదితర ప్రాంతాలను సందర్శించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్ (ILAC) ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు. లేబర్ అడ్డాల వద్ద భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ, వారి రిజిస్ట్రేషన్ రీన్యువల్ మరియు e-SHRAM రిజిస్ట్రేషన్కొరకుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్.లక్ష్మీనారాయణ, సంయుక్త కార్మిక కమిషనర్, కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్, విజయవాడ మరియు జి. ధనలక్ష్మి, ఉప కార్మిక కమిషనర్, విజయవాడ మరియు సంబంధిత సహాయ కార్మిక అధికారులు మరియు శాఖ సిబ్బందిపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *