Breaking News

బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమానికి ఏ లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లు శంఖుస్థాపన చేయనున్న నేపధ్యంలో శంఖుస్థాపన శిలాఫలకం, వేదిక ప్రాంతాన్ని రైల్వే, ఎంటిఎంసి, పోలీస్, రెవెన్యూ అధికారులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు భాధ్యత తీసుకొని నిర్దేశిత ప్రొటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్దం చేయాలన్నారు. కేంద్ర మంత్రి పర్యటన మార్గం, సభావేదిక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఎంటిఎంసి డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికాబద్దంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను, సభకు హాజరయ్యే వారికి మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని, ట్రాక్ కి ఇరువైపులా ప్యాచ్ వర్క్ లు, పిచ్చి చెట్ల తొలగింపు చేపట్టాలని ఎంటిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు విధులు కేటాయించబడిన ప్రతి అధికారి తమ సిబ్బందితో కార్యక్రమం పూర్తీ అయ్యే వరకు భాధ్యతగా ఉండాలని, ఏ విధమైన లోపాలు తలెత్తడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఆయా విభాగాల అధికారులు ముందుగానే కార్యకమ ప్రదేశానికి వెళ్లి పరిశీలించుకోవాలన్నారు.
పర్యటనలో ఎంటిఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డిసిపీ అశోక్ కుమార్, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావు, డిఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సిఐ వెంకట బ్రహ్మం, తహశీల్దారు రాఘవేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *