Breaking News

ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు ప్రజలు

-ముఖ్యమంత్రి దృష్టికి చేరిన విజయవాడ సమస్యలు
-సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించిన సీఎం
-త్వరలో పెన్షన్ లపై ప్రభుత్వం కొత్త పాలసీ
-గత ప్రభుత్వ పెద్దలు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్లింది లేదు
-విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 45 వ డివిజన్ ప్రజాదర్బార్లో ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కు ఎంపీ కేశినేని చిన్ని హాజరై ప్రజల నుండి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారుల తో మాట్లాడి సమస్యలపై వెంటనే స్పందించాలని సూచించారు

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత మంత్రి లోకేష్ సూచనల మేరకే ప్రజా దర్బార్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేసిన ప్రజలు అనేక సమస్యలతో ప్రజా దర్బార్ కు వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఇబ్బందుల వల్ల ప్రజలు ప్రజా దర్బార్ కు వస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విజయవాడలో ఉన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు విజయవాడ పార్లమెంట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా కలిసి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలు అన్నిటిపై సానుకూలంగా స్పందించి తగిన రీతిలో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.

అనేకమంది ప్రజలు పెన్షన్స్ పై సమస్యలు వచ్చాయని త్వరలోనే ప్రభుత్వం కొత్త పాలసీని పెన్షన్స్ పై తీసుకురానిందని అన్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుగానే ఉంటుందని ఇది మీ అందరి ప్రభుత్వమని ప్రజలకు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అని ఒక్కొక్కటిగా అమలు చేశామని గత ప్రభుత్వంలో ఎవరు ప్రజల దగ్గరకు వెళ్ళిందే లేదని అన్నారు జీవో నెంబర్ 30ని త్వరలోనే తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని చిన్ని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోఉమ్మడి కృష్ణ గ్రంథాలయ చైర్మన్ Ms బేగ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సాయి సుధాకర్, పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణరావు, పిల్ల శీను,మహిళ అధ్యక్షులు నసీమా నాయకులు పద్మ, మార్కెటింగ్ ఉపాధ్యక్షులు పి మాధవ, ఐ టి డి పి నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య నాయకులు కామా దేవరాజు,పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆశ వాణిజ్య విభాగంజిల్లా అధ్యక్షుడు సోలంక రాజు డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణ. ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, డివిజన్ నాయకులు చంద్రశేఖర్,మనోహర్, వంశీ, గౌరి ఎంరెడ్డి దయసాగర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *