విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46 వ డివిజన్.కు చెందిన ముదిలి శంకరరావు గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. బైపాస్ సర్జరీ కోసం 5,00,000/- ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాధితుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అతని వైద్య సహాయం కోరుతూ సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించినా ఎల్వోసీ నీ రోగి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో 49 డివిజన్ జనసేన అధ్యక్షుడు బాదర్ల శివ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్. సుజన మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News