Breaking News

అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పథకాల అమలు, పురోగతిపై సమీక్ష

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో ని తాజ్ హోటల్ నందు ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించబడింది. హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్థాయి సంఘం (Standing Committee on Housing and Urban Affairs) అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో కీలక సమావేశాలు మరియు అనౌపచారిక చర్చలు నిర్వహించ జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పథకాల అమలు మరియు పురోగతిపై సమీక్ష చేపట్టనున్నారు. ముఖ్యంగా AMRUT, AMRUT 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (Urban) 2.0, PM SVANidhi, Urban Challenge Fund, NUDM, PM e-Bus Sewa కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.
అదేవిధంగా Integrated Command and Control Centres (ICCCs) పనితీరు, నిర్వహణ అంశాలను సమీక్షించారు. CPWD, NBCC, HUDCO సంస్థల పనితీరు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో వాటి పాత్రపై చర్చించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇతర పట్టణ స్థానిక సంస్థల (ULBs) మానవ వనరుల సామర్థ్యం, ఆదాయ వనరుల సమీకరణ, బడ్జెట్ నిర్వహణ అంశాలపై ప్రత్యేక సమీక్ష జరిగింది. తిరుపతి వంటి వారసత్వ మరియు ఆధ్యాత్మిక నగరాల స్థిరమైన పట్టణాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్లమ్ పునర్వ్యవస్థీకరణ, పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై కూడా చర్చలు నిర్వహించారు.

ఈ అధ్యయన పర్యటన ద్వారా తిరుపతి నగరాభివృద్ధి, పట్టణ పరిపాలన బలోపేతం, మౌలిక వసతుల విస్తరణకు దోహదపడే కీలక సూచనలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అనంతరం మెప్మా వారి ఆధ్వర్యంలో 3,752 మంది వీధి వ్యాపారుల లబ్ధిదారులకు మొదటి, రెండో, మూడో విడతల కింద రూ.15.69 కోట్లు మంజూరు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం, లోక్ సభ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లోక్ సభ మెంబర్లు, ఎస్. సురేష్ కుమార్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం ఏ అండ్ యు డి, శ్రీమతి కరుణ ఐఏఎస్ ఎండి మెప్మా, బి అనిల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఎండి స్వచ్ఛ్ ఆంధ్ర, ఎండి ఏపీ టిడ్కో, ప్రభాకర్ ఈ ఎన్ సి పబ్లిక్ హెల్త్, స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA) చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మున్సిపల్ కమిషనర్ శారద, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిచంద్ర, HUDCO, NBCC, CPWD, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *