Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దద్దోజనం పంపిణీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు షేక్ షాకీర్ రేష్మ కుమారుడు రిహాన్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలను డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలవకు నిదర్శనంగా నిలిచే దద్దోజనం పాత గవర్నమెంట్ హాస్పిటల్ లోని పేషెంట్స్ కి, గర్భిణీ స్త్రీలకి అక్కడికి చూపించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఫ్రూట్స్ తో తయారుచేసిన దద్దోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, అవుటుపల్లి శ్రీనివాసరావు, సంసాని విజయలక్ష్మి, పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, సెంట్రల్ టిడిపి మహిళా అధికార ప్రతినిధి విజయ కుమారి తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *