-శనివారం జూమ్ కౌన్సెలింగ్
-వెనువెంటనే పోస్టింగ్ ఉత్తర్వులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి శనివారంనాడు పోస్టింగ్‌ల కేటాయింపు కోసం జూమ్ ద్వారా కౌన్సిలింగ్ జరగబోతుంది. జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపడుతున్నామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎపిఎంఎస్ఆర్‌బి) డిఎంఇ పరిథిలోని బోధానుసుపత్రుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 220, లేటరల్ ఎంట్రీ ద్వారా 97 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఇందులో క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ పోస్టులున్నాయి.
97 లేటరల్ పోస్టుల నోటిఫికేషన్ కు
744 దరఖాస్తుల రాక
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల నోటిఫికేషన్ ప్రకారం 1,706, లేటరల్ ఎంట్రీ పోస్టుల నోటిఫికేషన్ అనుసరించి 744 చొప్పున అప్లికేషన్లు వచ్చాయి.
ఈ దరఖాస్తుల్ని పరిశీలించిన నియామక సంస్థ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇతర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎంపిక జాబితాను ఖరారు చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో 155 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, లేటరల్ ఎంట్రీ విధానంలో 61 పోస్టులకు అభ్యుర్థుల్ని ఎంపిక చేసింది. ఈ జాబితాల
ఆధారంగా శనివారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని డీఎంఇ ( ఏఫ్ ఏ సీ )డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. కౌన్సిలింగ్ రోజునాడే పోస్టింగ్‌లు కూడా ఇస్తామని ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News