విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోరాడితే ఎంతటి నిరంకుశ ప్రభుత్వమైనా దిగిరావలసిందే అని రైతంగపోరాటం నిరూపించిందనీ, ఢిల్లీ మోడీ కంచుకోటనే కుదిపిన ప్రజాపోరాటాలకు గల్లీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను కుదపి కుదేలు చేయడం పెద్ద సమస్య కాదని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో కేంద్ర బిజెపి మోడి ప్రభుత్వం రైతు చట్టాలు రద్దు చేస్తామని ప్రకటించడం హర్షించ దగ్గ పరిణామమని, ప్రజా పోరాటాలవలనే ఈ విజయం సాధించడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తసిద్దితో రైతు చట్టాల రద్దుతో పాటు పంట గిట్టుబాటుధర చట్టం చేయాలని, అలాగే నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు, కార్మిక చట్టాలను, నూతన విద్యా చట్టాన్ని, NRC-CAA చట్టాలను కూడా రద్దు చేయాలని వేముల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కార్పోరేట్ల ప్రభుత్వానికి, ప్రజా దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి కోసం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానూ, చెత్త మీద పన్ను, పెట్రోల్, డీజిల్, కరెంట్ మరియు నిత్యవసర వస్తువుల ధరల దోపిడీ, ఎయిడెడ్ విద్యాసంస్థలను ఎత్తివేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన చదువులను దూరం చేసే రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాటాలకు చేయడానికి తెలుగు జాతి సంసిద్ధంగా వుండాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరిని మార్చుకుని ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే మోడీ బిజెపికి జరిగిన భంగపాటు భవిష్యత్తులో జగన్ వైసిపికి తప్పదన్నారు. ఢిల్లీ మోడీ కంచుకోటనే కుదిపిన ప్రజాపోరాటాలకు గల్లీ తాడేపల్లి ప్యాలెస్ ను కుదపి కుదేలు చేయడం పెద్ద సమస్య కాదనీ, రాష్ట్రంలో నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులపై పెట్టిన తప్పడు కేసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. తరుపున డిమాండ్ చేయడమైనదన్నారు.
