-జూపూడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చి దిద్దేందుకు అధికారులు కృషి చేయాలి…
-చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోంది…
-సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయో మెట్రిక్ విధానాన్ని అమలుచేయాలి…
-జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఆహ్లాదరమైన వాతావరణంలో జీవనం సాగించేలా జగన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు కృషి చెయ్యాలని జాయింట్ కలెక్టరు ఎల్. శివశంకర్ అన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం(క్లాప్) కార్యక్రమంలో భాగంగా శనివారం జాయింట్ కలెక్టరు శివశంకర్ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో గల సచివాలయాన్ని, చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పట్టణాన్ని గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చి దిద్దడమే జగననన్న స్వచ్చసంకల్పం ముఖ్యేద్దేశం అన్నారు.జూపూడి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గ్రామాల్లో క్లాప్ మిత్రాలు ప్రతి కుటుంబానికి తడి, పొడి చెత్త పై అవగాహన కల్పించాలన్నరు. సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా వర్మి కంపోస్టు తయారు చేసి రైతులకు అందించవచ్చన్నారు. జూపూడి గ్రామాన్నిమోడల్ గ్రామంగా తీర్చి దిద్దాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేత్త సేకరణ కొసం ప్రత్యేక వాహానాలను ఆయా గ్రామాలకు అందించిందన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ప్రతి రోజు గార్బేజ్ ఇళ్లలో తడి, పొడి, చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరళించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు డస్ట్ బిన్‌ల చొప్పున పంపిణీ చేసామనానారు. ఇప్పటికే గ్రామ పంచాయితీలకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తెచ్చేవిధంగా మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నరు. ఈ కేంద్రాల వద్ద సిబ్బందిని నియమించి నిర్వహణ పటిష్ట పర్చాలన్నారు. జగనన్న స్వచ్చసంకల్పం క్లాప్ కార్యక్రమం ద్వారా జిల్లాను చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
సచివాలయాలన్ని సందర్శించిన జాయింట్ కలెక్టరు శివశంకర్
అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబందించి రికార్డుల నిర్వహణ, ఉద్యోగులు హాజరు బయోమెట్రిక్ విధానాన్నిపరిశీలించారు. అనంతరం ఆయన సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటిస్తూ లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలను నిర్ణీత సమయంలోనే అందించాలన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్చ సర్వేక్షణ, జగనన్న పాలవెల్లువ, వైఎస్సార్ జలకల, ఎన్ఆర్ఈ జిఎస్, ఓటీఎస్, స్పందన, పాలవెల్లువ అంశాలపై ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో యంపీడీవో బి.శ్రీనివాసరావు, కార్యదర్శి మునేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, క్లాప్ సిబ్బంది తదితలు పాల్గొన్నారు.