లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం…
-యంపీడీవో వెంకటరమణ

గుడివాడ రూరల్, (రామనపూడి), నేటి పత్రిక ప్రజావార్త :
పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు.
గుడివాడ రూరల్ మండలం రామనపూడి గ్రామంలో బుధవారం గ్రామ సచివాలయం వద్దం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) పై యంపీడీవో వెంకటరమణ, హౌసింగ్ డీఈ రామోజీనాయక్, సచివాలయ సిబ్బందితో కలసి లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా యంపీడీవో మాట్లాడుతూ గతంలో మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నావారు గృహనిర్మాణ సంస్థలో బకాయిలతో సంబందం లేకుండా ప్రస్తుతం రూ. 10 వేలు సంబందిత సచివాలయంలో చెల్లిస్తే బకాయిలు రద్దుతో చేసి వారి పేరున ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుదన్నారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీవో కుమారి వెంకటరమణ క్షేత్ర స్థాయిలో సిబ్బంది నందరిని కలుపుకుంటూ రామన్నపూడి గ్రామంలో ప్రజా చైతన్య సభలు నిర్వహించడం జరిగింది.
గృహనిర్మాణ సంస్థ డీఈ రామోజీనాయక్ మాట్లాడుతూ రామనపూడి గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 300 లబ్దిదారులను గుర్తించి 199 మందిని ఆన్ లైన్ చేసామని ఇప్పటి వరకు 3గురు మాత్రమే ఓటీఎస్ ను సద్వినియోగం చేసుకున్నారన్నారు. మిగిలిన వారు త్వరత గతిన ముందుకు రావాలని కోరారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా గ్రామంలో 78 ఇళ్లపట్టాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 22 లబ్దిదారులు మాత్రమే ముందుకు వచ్చారని మిగిన వారు కూడా ముందుకు వచ్చి వేగవంతంగా ఇళ్లను నిర్మించుకోవాలని కోరారు. ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుక, ఇతర మెటీరియల్ గ్రామ స్థాయిలోనే అందిస్తున్నామని ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఆగస్టు మాసం వరకు ఇళ్ల నిర్మాణానికి సంబందించిన పేమెట్లు అన్ని లబ్దిదారులఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఈడీ రామోజీనాయక్ తెలిపారు. ఈ సందర్బంగా రామన్నపూడి గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ పథకంలో భాగంగా నిర్వహించిన ప్రజా చైతన్య సభకు స్పందనగా గ్రామంలో బండి భాస్కర్ రావు అనే లబ్ధిదారుని నుండి గృహ నిర్మాణ సంస్థ నిర్దేశించిన రుసుమును స్వీకరించి రుణ విముక్తి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామోజీ నాయక్, పంచాయతీ కార్యదర్శి అర్.వి కృష్ణ, స్థానిక ప్రతినిధులు, ఇళ్ల కాంట్రాక్టర్లు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *