మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును కూడా కలెక్టర్ బెడ్లను ఏర్పాటైన సౌకర్యాలను టాయిలెట్లను సైతం పరిశీలన చేశారు. గాలి వెలుతురు ప్రసరించే విధంగా వెంటిలేటర్లు సరిగా లేవని వాటిని మార్చాలని అలాగే వాష్ బేసిన్, మిర్రర్ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. రోగులకు సంబంధించిన బెడ్లను దుప్పట్లు, ఇతర దుస్తులు శుభ్రపరిచే ప్రదేశాన్ని సైతం పరిశీలించి శానిటేషన్ సంబంధించి పలు జాగ్రత్తలు సూచించారు. ఇన్ఫెక్షన్ ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచాలని అన్నారు. ఆయా వార్డులలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లకు తావుండరాదని, వ్యాధిగ్రస్తులలో నమ్మకం పెంపొందించేలా వారితో వైద్యులు, సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని హితవు పలికారు. మరింత మెరుగైన సేవలు అందించాలని, అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం మరింతగా పెరుగుతుందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని, అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా రోగులలో వారి కుటుంబకు లకు సాంత్వన చేకూర్చాలన్నారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. ఈ కోవిడ్ వార్డు పరిశీలనలో జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఆర్టిఓ ఖాజావలి ఆసుపత్రి సూపర్డెంట్ జయ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …