ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ కౌంటింగ్ కేంద్రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని.. ఇందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎ.కొండూరు, విస్స‌న్న‌పేట‌, తిరువూరు, గంప‌ల‌గూడెం మండ‌లాల సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ తిరువూరులోని శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ క‌ళాశాల కేంద్రంలో జ‌రుగుతుంద‌న్నారు. విజ‌య‌వాడ రూర‌ల్ మండలానికి సంబంధించి విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఓల్డ్ మాంటిస్సోరి క‌ళాశాలలో జ‌రుగుతుంద‌న్నారు. జి.కొండూరుకు కుంట‌ముక్క‌ల‌లోని ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో కౌంటింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. అదేవిధంగా మైల‌వ‌రం, రెడ్డిగూడెం మండ‌లాల‌కు మైల‌వ‌రంలోని ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో, ఇబ్ర‌హీంప‌ట్నంకు కొండ‌ప‌ల్లి జెడ్‌పీ బాలిక‌ల హైస్కూల్‌లో, జ‌గ్గ‌య్య‌పేట‌, పెనుగంచిప్రోలు, వ‌త్స‌వాయి మండలాల‌కు జ‌గ్గ‌య్య‌పేట‌లోని ఎస్‌జీఎస్ క‌ళాశాల కేంద్రంలో జ‌రుగుతుంద‌న్నారు. నందిగామ మండ‌లానికి నందిగామ జెడ్‌పీ ఉన్న‌త‌పాఠ‌శాలలో, చంద‌ర్ల‌పాడుకు నందిగామ కేవీఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో కంచిక‌చ‌ర్ల‌, వీరుళ్ల‌పాడు మండ‌లాల‌కు కంచిక‌చ‌ర్ల మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు