-మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జి.వి. కృష్ణారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ గురువారం కానూరులోని ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జి.వి. కృష్ణారావు మేయర్ వంగవీటి రాధాకృష్ణకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని మేయర్‌కు సూచించారు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధాకృష్ణ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
