విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా నగర పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాంతి రాణా టాటా కు జిల్లా కలెక్టర్ జె నివాస్ శుభా కాంక్షలు తెలిపారు. గురువారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాంతి రాణాను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ జె.నివాస్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్,రెవెన్యూ,ఇతర అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి జిల్లా ను ప్రగతి పథంలో వుంచదమని కమీషనర్ అన్నారు.సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ కూడా నగర పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో వున్నారు.
Prajavartha Online Telugu News