Breaking News

గ్రామాలలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తాం…

-మండల పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడతాం..
-జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు హౌసింగ్ అధికారులు, గ్రామ సర్పంచ్ లు కృషి చేయాలి.
-శాసనసభ్యలుదూలం నాగేశ్వరరావు

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సేవ అదృష్టంగా భావిస్తూ గ్రామాల అభివృద్దికి ప్రజాప్రతినిధులు అంకితభావంతో కృషి చేయాలని శాసనసభ్యలు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ముదినేపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మండల తొలి సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ఫిల్టర్ బెడ్స్, నిర్మాణాలు, అదేవిదంగా ఓహెచ్ఆర్ ఎస్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ స్మశాన వాటిక మెరక పూడిక, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు నిధులు కేటాయించి పనులు చేయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులతో ప్రతి గ్రామంలో ఇంటి స్థలాలు ఇచ్చామని, రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా 6 అడుగుల పూడికకు అనుమతులు తెచ్చామన్నారు. ప్రతి నూతన లే అవుట్ లో కూడా దాదాపుగా పూడిక పనులు పూర్తి అయ్యాయని, లే అవుట్ లో, త్వరగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలనీ, ఇంటి నిర్మాణాల పూర్తి బాధ్యత, హౌసింగ్ అధికారులు, సర్పంచ్ లదే నన్నారు. అదేవిదంగా ముదినేపల్లి మండలానికి రూ.1 కోటి 18 క్షలు రూపాయలు నిధులు కొత్తగా మంజూరు చేశామన్నారు. గ్రామాలలో ముఖ్య అవసరాలకు, ఫిల్టర్ బెడ్స్, స్మశానవాటిక పూడికలు, స్మశానవాటికల ప్రహరీగోడలు, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు, ముఖ్యంగా గ్రామాలలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, బాధ్యత తీసుకోని నూతనంగా ఇచ్చిన ఇంటి నిర్మాణాలు పూర్తిగా నూరు శాతం చెయ్యాలని, లేనిపక్షంలో ఇంకా అర్హులను గుర్తించి వారికీ ఇంటి పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణాలు పూర్తిగా చేయాలనీ ఆదేశించారు. ఎంపీటీసీలు కీలక బాధ్యత తీసుకోని సర్పంచ్ లతో కలిసి గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ఐసీడీఎస్ అధికారుల పనితీరు నాకు సంతృప్తిగా ఉందని, వారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.ముదినేపల్లి మండలంలో దేవపూడి పీహెచ్ సీ వైద్యుల పని తీరు మెరుగుపడేలా సంబంధిత ఉన్నతాధికారులకు తెలియచేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఏ అధికారి అయిన ఉద్యోగం చేసే ప్రాంతంలోనే నివాసం ఉండాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలి అంటే చాలా కష్టం అన్నారు. అందుబాటు లో ఉంటే సమయపాలన సమస్యలు రావని, ఉద్యోగులు ఆదిశగా పనితీరు మెరుగు పరుచుకోవాలన్నారు. ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేసి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని అన్నారు. ముందుగా తొలి సమావేశానికి వచ్చిన జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ చొపర్ల సునీత, గౌరవ సర్పంచ్ లు, ఎంపీటీసీసభ్యులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో తాశీల్థారు శ్రీనివాస్, పీఆర్ డీఈఈ సురేష్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ పల్లంరాజు, ఎన్ఆర్ఈజీఎస్. ఏపీఓ రాజు, డ్వాక్రా ఏపీఎం, తిరుపతయ్య, ఎంఈవో నరేష్, ఎంపీటీసీలు మరీదు నాగయ్య, జంపన కోటయ్య, తుమ్మచర్ల యేసు, పల్లి శ్రీదేవి, పేరం నాగలక్ష్మి, బోయిన నాగరాజు, వీరమళ్ళు కొండలరావు, రాచురి రాధకాళిలక్ష్మి సుకన్య, కోటే ప్రవీణ్, మరీదు వరలక్ష్మి, దాసరి అరుణకుమారి,రెడ్డి సతీష్ బాబు, దుసనపూడి సునీత, సర్పంచ్ లు, శీలం రామకృష్ణ, కాగిత రామారావు, చిట్టూరి నాంచారయ్య, పేరం రామకృష్ణ, సింగనపల్లి రామకృష్ణ, అల్లు సుశీల, చిన్నం అర్జునరావు, సుధాబత్తుల పద్మావతి, మొవ్వ జయలక్ష్మి, పుట్టి మాధవి, నువ్వుల కోటేశ్వరరావు, అబ్బీశెట్టి వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సాయి, అర్జా రామాజోగేశ్వరరావు, వల్లభనేని లక్ష్మి, నిమ్మగడ్డ కైకమ్మ, సైడల శ్రీనివాసరావు, ఆడుసుమిల్లి కృష్ణకుమారి, బోయిన విమల,నాయకులు ఈడే వెంకటేశ్వరరావు,తడంకి రాజేష్,నర్రా వెంకటేశ్వరరావు, వల్లభనేని వెంకటరావు, దివి సతీష్, పేర్ని పృథ్వి,పల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *