Breaking News

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి…

-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘విద్యార్థి కేంద్రీకృత విపత్తు ప్రమాద తగ్గింపు’’ శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులు నేర్చుకున్న వివిధ అంశాలను తమ తమ పాఠశాలల్లో అమలు పరచి, విద్యార్థి భద్రత, పాఠశాల భద్రతలకు తోడ్పడాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ సంయుక్తంగా గుంటూరు జిల్లా బాపట్లలోని ఎక్సెటెన్సన్ ట్రైనింగ్ సెంటరులో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముగింపు సభకు హాజరైన డా. బి.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ‘నేటి బాలలే రేపటి ప్రపంచ పౌరులుగా’ గుర్తించి వారి వారి మానసిక ఔన్నత్నాన్ని, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల 114 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో భాగంగా విపత్తు నిర్వహణ, విద్యార్థి కేంద్రీకృత విపత్తు తగ్గింపు, బాలల హక్కులు, విపత్తుల సమయంలో బాలల హక్కుల రక్షణ, వాతావరణ మార్పులలో పిల్లల సంరక్షణ, పాఠశాల భద్రత, బాలల మానసిక ఆరోగ్యంపై విపత్తుల ప్రభావం, పిల్లల్లో సామర్థ్యాభివృద్ధి , విద్యార్థి కేంద్రీకృత విపత్తు నిర్వహణను ప్రధాన స్రవంతిలో కలపడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులను బాపట్ల సమీపాన కొండబొట్లవారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి వారు నేర్చుకున్న విషయాలను ఆ పాఠశాలలో పరిశీలింపజేసి వాటి మీద చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలు తమ పాఠశాలల్లో అమలవుతున్నాయో లేదో పరిశీలించుకోవాలన్నారు. తమ వరకు పరిమితం చేయకుండా ఉపాధ్యాయ సమావేశాల్లో, శిక్షణ కార్యక్రమాల్లో, అవకాశం వచ్చిన ప్రతిసారీ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన పరచాలని శిక్షాణార్థులకు కోరుతూ, వారికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ జి.కె.పద్మజ రిసోర్సు పర్సన్లకు మెమోంటోతో సత్కరించారు. NIDM CCDRR సెంటర్ ప్రొగ్రాం ఆఫీసర్ డా. కుమార్ రాకా, ప్రాజెక్టు అసోసియేట్స్ డా. బాలు, డా రంజన్ కుమార్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ షేక్ నాజియా రిసోర్సు పర్సన్లుగా వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *