-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ పేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక రోడ్ లో జరుగుతున్న రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఏలూరు కెనాల్ బండ్ ను పరిశీలిస్తూ, కాలువ గట్టు అంచు వెంబడి గల చెత్త, వ్యర్ధములను మరియు డెబ్రిస్ తొలగించి శుభ్ర పరచుటతో పాటుగా బండ్ పటిష్ట పరచుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. తదుపరి 3వ డివిజన్ కేశినేని మార్గ్ నందు చేపట్టిన రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షిస్తూ, పలు రోడ్ల యందు ఇంకను చేపట్టిన లేదా చేపట్టవలసిన ప్యాచ్ వర్క్ పనులను కూడా సత్వరమే ప్రారంభించి పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. పటమట ఆర్.ఆర్.గార్డెన్స్ సుశీలమ్మ వీధిలో రోడ్ విస్తరణకు సంబందించి టి.డి.ఆర్ బాండ్ మంజూరు కొరకు సదరు ప్రదేశాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, డిప్యూటీ సిటి ప్లానర్ బాలాజి మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
46వ వార్డ్ సచివాలయాని సందర్శన
11వ డివిజన్ తంగెళ్ళమూడి వారి వీధి నందలి 46వ వార్డ్ సచివాలయాన్ని సందర్శించి సచివాలయ సెక్రటరీలు నిర్వహిస్తున్న రిజిస్టర్ లను పరిశీలించి కోవిడ్ వ్యాక్సిన్ పొందని వారిని గుర్తించి అట్టి వారందరికి వ్యాక్సిన్ వేయునట్లుగా చూడాలని అన్నారు. ప్రజలకు అందించు సేవలు సక్రమముగా అందుతున్నవి లేనివి అడిగితెలుసుకొన్నారు. నోటీసు బోర్డు నందు ఎప్పటికప్పుడు లబ్దిదారుల జాబితా మరియు సంక్షేమ పథకముల వివరములు క్రమ పద్దతిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.
Prajavartha Online Telugu News