Breaking News

ఎపిటిఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతాంజ నేయ ప్రసాద్ డిమాండ్‌ చేశారు.ఎపిటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కార్యవర్గ సమావేశం లో అర్బన్ జిల్లా అధ్యక్షులు వై. రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.2021-23 సంవత్సరానికి గాను అర్బన్ జిల్లా శాఖ నూతన సబ్ కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది.ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన దుర్ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ కుటుంబ‌స‌భ్యులతో పాటు ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజకు ,ఇతర సైనికుల కుటుంబాలకు, రైతు ఉద్యమ అమరవీరులకుకూడా ఎపిటిఎఫ్ సంతాపం తెలియజేశారు. నూతన కార్య వర్గం అధ్యక్షులుగా కె.సాంబశివరావు , ప్రధానకార్యదర్శి నయీం అహ్మద్ , ఉపాధ్యక్షులుగా వై. రవి శంకర్ , ఎస్ కె. ఉమర్ అలీ , ఎన్.అవని యం. దుర్గా ప్రసాద్, ఫజల్ ఉర్ రెహ్మాన్, కార్యదర్శులుగా మొయినుద్దీన్ పాష జీ.వి శ్రీనివాస్ కె.శ్రీరమ . సిహెచ్. సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతాంజ నేయ ప్రసాద్ వ్యవహరించారు. నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు సాగనుంది. ఉపాధ్యాయులు , ఉద్యోగస్తులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ప్రధానకార్యదర్శి నయీం అహ్మద్ తెలిపారు.ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న 11వ పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *