Breaking News

ప్రతీ పేదవానికి హ్యాపీ హోమ్


-నూతనంగా నిర్మించే గృహాల్లో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య చర్యలు అమలు
-గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
-నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు పథకం లో రాష్ట్రంలో నూతనంగా 28. 3 లక్షల ఇల్ల నిర్మాణం
– మొదటి దశలో 15.6 లక్షల ఇల్లు.. రూ. 28,000 కోట్ల వ్యయం
– వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం 32,909 కోట్లు వ్యయం
-లబ్ధిదారుల గృహాల్లో విద్యుదీకరణ కు రూ 7080 కోట్లు
-ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ పథకం దేశానికే ఆదర్శంగా ఉండాలి
-నిరుపేదలకు హుందాగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మెరుగైన జీవితం జీవించేలా గృహవసతి
-ఇదే ముఖ్య మంత్రి లక్ష్యం – అజయ్ జైన్
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ చర్యల పై లబ్దిదారులకు అవగాహనా కల్పించాలి – గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-లబ్ధిదారుల సమ్మతితోనే నూతన గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలు అమలు
-రాష్ట్రం విద్యుత్ వినియోగం లో 28 శాతం గృహ విద్యుత్ కేటగిరీ లోనే
-ఇంధన సామర్థ్యం తో ఇళ్లలో 20 శాతం వరకు విద్యుత్ ఆదా కు అవకాశం
-ఇళ్లలో ఇంధన సామర్థ్యంతో ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తగ్గుదల, కరెంటు బిల్లు తగ్గుదలకు అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణ పథకం కింద అత్యుత్తమ గృహ వసతి కలిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఇందు కోసం అన్ని సౌకర్యాలతో కూడిన జగనన్న కాలనీలను నిర్మించడమే కాకుండా, ఆయా గృహాలలో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఈ గృహాల్లో విద్యుత్ పొదుపుతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (రెసిడెన్షియల్- ఎకో నివాస్ సంహిత ) అమలు పై ఈ నెల 16 న విజయవాడ లో జరగనున్న జాతీయ సెమినార్ నేపథ్యంలో నేడు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడారు. రాష్ట్రంలోని నూతనంగా నిర్మించనున్న 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్ధ్య చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ఇంధన శాఖ కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ , ఇండో స్విస్ బీప్ సహకారంతో పేదలకు నిర్మించే గృహాల్లో ఈ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే లబ్దిదారుల సమ్మతితోనే స్వచ్చందంగా ఇంధన సామర్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఇంధన సామర్ధ్య చర్యల వల్ల గృహాల్లో 20 శాతం విద్యుత్ వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం దేశంలోనే అతి పెద్దది కావడంతో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు అజయ జైన్ తెలిపారు . గృహ నిర్మాణ పథకం అంటే కేవలం ఇల్లు నిర్మించడంతోనే సరిపెట్టుకోకుండా , లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మేరుగుపడేలా, అత్యుత్తమ గృహ వసతి కలిపించాలని సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. అయితే నిరుపేదలకు హుందాగా , సురక్షితంగా, సౌకర్యవంతంగా మెరుగైన జీవితం జీవించేలా గృహవసతి కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాన్ని దేశానికే ఆదర్శంగా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అజయ్ జైన్ తెలిపారు .
ఈ దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల్ని అనుసరించి వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో అన్ని రకాల వసతులు కలిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ 32909 కోట్లు వెచ్చిస్తునట్లు ఆయన వివరించారు. ఈ నిధులతో జగనన్న కాలనీలలో పక్కా సిమెంట్ రోడ్లు , సిమెంట్ డ్రైన్లు, మంచి నీటి సరఫరా , విద్యుదీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజి తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు . ప్రత్యేకించి లబ్ధిదారుల గృహాల్లో విద్యుదీకరణ కు రూ7080 కోట్లు గృహ నిర్మాణ శాఖ వ్యయం చేస్తున్నట్లు వివరించారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో 38 శాతం నివాస గృహాల కేటగిరీలలోనే వినియోగం అవుతుందన్నారు. మన రాష్ట్రంలో ఈ కేటగిరీలో వార్షిక వినియోగంలో ఏడాదికి 28 శాతం (17514 మిలియన్ యూనిట్లు ) వినియోగం అవుతున్నదన్నారు. ఈ దృష్ట్యా నివాస గృహాల నిర్మాణ సమయంలో ఇంధన సామర్ధ్య చర్యలు చేపట్టడం తప్పనిసరిగా మారిందన్నారు. దీని వల్ల విద్యుత్ వినియోగం తగ్గి లబ్దిదారులకు మేలు కలుగుతుందని , పర్యావరణానికి హితకరమని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు .
గృహ నిర్మాణ్ పథకం లబ్దిదారుల్లో ఎనర్జీ ఎఫిసిఎన్సీ చర్యల అమలు పై అవహగాహన కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు సూచించినట్లు అజయ్ జైన్ తెలిపారు. ఇంధన సామర్ధ్య కార్యక్రమాల పై హౌసింగ్ , పంచాయతీరాజ్ శాఖ ల సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్ని త్వరగా పూర్తి చేసి క్షేత్ర స్థాయి లో త్వరగా అమలయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించినట్లు, హౌసింగ్ ఎండీ , నారాయణ్ భరత్ గుప్తా , స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే లకు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మొదటి విడత కింద ఇప్పటికే రూ 28000 కోట్ల వ్యయంతో 15. 6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనది . రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అభివృద్ధి చేసిన 10055 లేఔట్ లలో ఇళ్ల నిర్మాణం చురుకుగా జరుగుతుందని అజయ్ జైన్ వివరించారు .
గృహ నిర్మాణ లబ్దిదారులకు మెటీరియల్ సరఫరా సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 245 భారీ లేఔట్లలో గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. లబ్దిదారులకు అవసరమైన వివిధ రకాల మెటీరియల్ ను ఆ గోడౌన్లలో సిద్ధంగా ఉంచుతున్నట్లు చెప్పారు . ఇప్పటికే 11 గోడౌన్ల నిర్మాణం జరిగినట్లు తెలిపారు .
ఇండో స్విస్ బీప్ , రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సమన్వయంతో హోసింగ్ , గ్రామా వార్డు సచివాలయల్లో 13000 ఇంజినీర్లకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా ట్రైనింగ్ ఇస్తుంది . లబ్దిదారులకు కూడా దీని పై అవగాహన కల్పించడం జరిగితుంది .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *