-ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్
-ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలింగ్ ఏజెంట్ల ఉన్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ… ఈ పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం సాధారణంగా 10 నుంచి 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఓటర్లు పోలింగ్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గత కొన్ని వారాలుగా మీడియా ద్వారా, వివిధ వేదికల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ పిలుపునిచ్చారు.
